Sunday, October 2, 2011

లైవ్‌లో తుమ్ములా....?

'ఆఫీసాఫీసూ.. ఇంకా మాట్లాడితే స్టేట్ మొత్తం దడుచుకొని వుంటారూ అన్నాడు చీఫ్ ఎడిటర్. కోర్‌మీటింగ్. 'ఇక నీ పని సరీ అన్నట్లు చూస్తున్నారు కొలీగ్స్. 'మనమేంచేస్తాం సఋ అన్నాను కాస్త వణుకుతూ. 'అదేంటండీ.. ఇర్రెస్పాన్సిబుళ్ అన్నాడాయన చిరాగ్గా. దిక్కులు చూడతం తప్ప దారిలేదు. 'అలా క్యాజువల్‌గా చూస్తున్నానండి, ధఢేల్ మని సౌండూ' అన్నాడు మా చీఫ్. నవ్వాపుకోలేక మా గుంపులో ఒకళ్ళిద్దరు గట్టిగా, మిగతావాళ్ళు సౌండు లేకుండా నవ్వారు. 'మైకూ.. ముక్కుకు దగ్గరగా వుందికదా సర్.. వంగి తుమ్మేసరికి అంత సౌం....డూ' అన్నాను. 'మన యాంకరికికూడా ముందు ఐడియా లేదట సర్. హటాత్తుగా ఆపుకోలేకుండా వచ్చేసిందటా. పాపం, మా చీఫ్ కేమిటీ.. నాకే ఆ లైవ్‌లో అంతనోరేసుకుని, పైగా మైకు ముందుకల్లావంగి తుమ్మిన యాంకర్ పని పట్టేద్దామనివుంది. నాకంటే ముందే అదే ఏడుపు మొహంపెట్టింది. ఆవిడ ఎక్స్‌ప్రెషన్స్‌చూసి కెమేరామెన్ చాకచక్యంతో క్యాం ఎక్స్‌పర్ట్‌కి డైవర్ట్ చేసాడు ఇంకా నయం. 'అబ్బే లైవ్‌లో తుమ్ములూ, దగ్గులూ ఎంబ్రాసింగా వుండవూ..' అన్నాడు చీఫ్. ఆయనకు కోపం తగ్గించే మార్గం లేదు. రావే ఈశ్వరా కావవే వరదా.. అని మనస్పూర్తిగా ప్రార్థించే వుంటాను. మా చీఫ్ ఫోన్ మోగింది. 'స్విచ్చెర్ ఆపరేటర్ యోగేష్‌ని రమ్మన్నారట. మీ డోర్ దగ్గర వెయిటింగ్' అని పిఏ గొంతు స్పస్టంగా అందరికీ వినపడింది. అంతలోనే డోర్ తెరుచుకొని యోగెష్ వచ్చాడు. ఒక మనిషి నేను మండాలి అని నిశ్చయించుకొంటే ఎలా మండచ్చో మా చీఫ్‌లో విజువల్గా చూసామందరం. 'యోగేష్ బుద్ధుందా.. కాలు తగిలి వాటర్ బాటిల్ పడి, వాటర్ ఫ్లోర్‌పైన పరుచుకుపోతుంటే చూడమని బాయ్‌కి కదా వేలు చూపించింది. దాన్ని.. హైలైట్ చేస్తావానువ్వు ..నా బూట్ క్లోజప్‌లో ఎందుకు చుపించావో చెప్పూ. యోగెష్ అందరివైపూ చూసాడు. మండుతున్న చీఫ్ మొహం చూసాడు. 'లైవ్‌లో మీముందు మాట్లాడిన ఎక్స్‌పర్ట్ మీడియా వాళ్ళని, ఇలాంటి రాతలు రాసినా, తీసినా చర్మం వలిచి కొట్టాలి అంటున్నాడు సర్. అంతలో మీరు వేలు చూపించారు. ఒకవేళ మీరు అలావాగితే చెప్పుతీసుకొని కొడతా అన్న అర్థమొచ్చేలా వేలితో బూట్ చూపిస్తున్నారేమోనని బ్రైన్ థాట్ సర్' అన్నాడు సిన్సియర్‌గా. న్యాయంగా కోర్ మీటింగ్ హాల్ నవ్వులతో దద్దరిల్లి పోవాలి. అలా పోతే వుద్యోగాలు గాలికి ఎగిరిపోతాయని ప్రతివాడూ సర్వశక్తులూ ఒడ్డి ఇనప మొహాలు పెట్టుకొన్నారు. నవ్వింది మా చీఫ్ ఒక్కడే. పైగా.. ఎవ్వళ్ళూ నవ్వనందుకు ఎవ్వడికీ సెన్సాఫ్‌హ్యూమర్ లేదని తిట్టిపోసాడు. ఆ ఊపులో లైవ్‌లో తుమ్మిన యాంకర్‌ని క్షమించి పారేసాడు.
నీతి: ఎంత దగ్గయినా... తుమ్మయినా సరే లైవ్‌లో క్షమించరాని నేరం.
మనలో మనమాట: స్క్రీన్‌పైన చక్కగా నగలేసుకుని, కర్టసీ సారీ కట్టుకొని నోరంత తెరచి తుమ్మటమేమిటండీ అసహ్యంగా.. నాకూ నచ్చలేదు. ఇదిగో ఎవరక్కడ.. పోయి, నిన్న లైవ్‌లో తుమ్మిన పిల్లని పరిగెత్తుకొంటూ రమ్మనండి.. ఇక్కడున్నట్లు రావాలి... అర్జంట్.. సుజాతా.. మజాకా..!

5 వ్యాఖ్యలు:

Anonymous said...

good evening amma....me live lo ...story chadivaanu....really live ga undi...e channel experience talli adi.....meeru comedy kuda adhara kottestarani ippude telisindi.....great work amma..namaste

Kalpana Rentala said...

సుజాతా,
అంతర్జాల మాయాజాల ప్రపంచానికి సాదర స్వాగతం.:-))
మొత్తానికి మీడియా లో దగ్గరుండీ అన్నీ గమనించేసి ఇలా రోజూ మాకు ఒక నవ్వుల ఎపిసోడ్ విజువల్ గా చూపిస్తున్నవన్న మాట.

మరి మంచి కథలు కూడా రాసి పోస్ట్ చేసెయి.

Anonymous said...

మీ పోస్ట్లు చదువుతూ ఊహించుకుంటుంటే భలే నవ్వొస్తుందండీ .లైవ్ లో ఏదొచ్చినా కష్టమే పాపం !

Anonymous said...

చాలా ధైర్యంగా రాస్తున్నారు.చానల్ లో పని చేస్తూ వాటి గురించి ఇలా రాయగలగడం మామూలు విషయం కాదు. ఇప్పుడు మీరు చానల్ లో జర్నలిస్ట్ గా పని చేస్తున్నారా.. ? మీ ఆఫీసు వారు ఎమీ అనరా ?..........
- విష్ణు .....

సి.సుజాత said...

ఇవన్నీ కథలే. ఒక ఏరియా గురించి మనకు క్షుణ్ణంగా తెలిస్తే రాయగలిగిన కథలు. పైగా ఇందులో ఎవర్నీ నొప్పించే అంశాలు ఏమీ లేవు. ఎవరైనా భుజాలు తడుముకుంటే తడుముకో నివ్వండి. ఇవన్నీ సరదాకోసం రాసినవి.. నవ్వుకోండి. నేను మీడియాలోనే వున్నాను.
- సి.సుజాత