Tuesday, October 4, 2011
'ఒక్కటంటే ఒక్క బైట్ తేలేకపోయావా...'
'మొహం పగిలిపోతుంది సర్. కెమేరా డామేజ్ అవుతుందని కెమేరామెన్ కూడా కోపరేట్ చేయటం లేదు...'
'చూడండయ్యా.. పక్క చానల్స్ చూడండి.. వాడెవడో ఒక్కడే.. దూకుడులో మహేష్‌లాగా బస్సుల్ని రాళ్ళుచ్చుకొని కొట్టుకొంటూ పోతున్నాడు...'
'అదే సర్ ఆలోచిస్తున్నా.. మనం కూడా ఏదైనా మేనేజ్ చేయగలమా అని...'
'అంటే ఏమిటి నీ ఉద్దేశం. నువ్వే ఎవడిచేతనైనా రాళ్ళేయిద్దామనా....'
మా చీప్ గావుకేక పెట్టాడు. ఫోన్ విసరికొట్టినట్టు టేబుల్ పైన పెట్టేసాడు.
'ఉదయం నుంచి ఆల్ చానల్సూ.. సకల జనుల సమ్మే .. బంధూ.. జనాల్ని రాళ్ళతో మాడు పగిలేలా ఆందోళనకారులు కొట్టటం.. పరమ ఉత్సాహంగా లైవ్‌లిస్తున్నాయి. మా చానల్‌కి ఇంకా ఫీడ్ రాలేదు. కోర్ మీటింగ్‌లో, మేమంతా బిస్కట్‌లు తిని, కాఫీలు తాగి.. అదే చర్చిస్తున్నాం.
'ఈ భద్రాచలం రిపోర్టర్ చాలా డేంజర్లా వున్నాడే.. ఖమ్మం రిపోర్టర్ ఏమైయ్యాడసలు.. ఈ భద్రాచలంగాడు ఖమ్మం రోడ్లపైకి ఎందుకొచ్చాడో కనుక్కో' అన్నాడు చక్రవర్తితో మా చీప్.
మా అవుట్‌పుట్ చక్రవర్తికి తను ఈ ఫీల్డ్‌లో ఒకే ఒక్కడనని, తనే నంబర్‌వన్అని పిచ్చ నమ్మకం.
'ఖమ్మం పులిగాడు బంధ్ యాక్టివిటీస్‌లో రిస్క్ తీసుకోలేనని, ఎవరైనా రాయిచ్చుకు కొడితే తల పగులుతుందని చేతులెత్తేసాడు సర్. భద్రాచలంగాడిని నేనే తరిమా. వదిలేయండి సర్. గంటలో బైట్స్ లైవ్ ఇద్దాం. ఇద్దరు యూత్‌లీడర్స్‌కి చెప్పేసా. బంధ్ గురించి ఒపీనియన్ పోల్ కోసం మాస్ రెడీ' అన్నాడు గర్వంగా మా అందరివైపూ చూసి.
'వెరీ గుడ్ చక్రవర్తీ.. రిపోర్టింగ్‌లో రాణించాలంటే నీకులాగ గట్స్ కావాలి. ఎయిటీటూలో మేం ' అని.. అంటూ మా చీప్ పాత డ్రీంలోకి వెళ్ళిపోయాడు. చాలా సార్లు ఆ డ్రీం మేం చూసేసాం కాబట్టి చెవులు మూసుకొని హరహరా అనుకోబొయే లోగానే గ్లాస్ డోర్ పగలగొట్టుకొని దూసుకొంటూ వచ్చిందొక రాయి. 'వామ్మో.. ' అన్నారు అందరూ. చక్రవర్తి అరెంజ్‌చేసిన ఆందోళన కారులకు కాన్సెప్టు అర్థం కాలేదులా వుంది. వాళ్ళ అభిప్రాయన్ని గాలికొదిలేసి కింద పార్క్ చేసివున్న మా చీప్ కారు బుర్ర బద్దలగొట్టేసారు. ఆఫీస్ అద్దాలు ముక్కలు చేసేసారు. అందరం కిందికి తొంగి చూసాం. మా చక్రవర్తి పెట్ కెమేరామెన్ గర్వంగా యూత్ లీడర్స్ ఇద్దరినీ ఎండలో నిల్చోబెట్టి ఒపీనియన్ తీసుకొంటున్నాడు.
'మా డిమాండ్స్ ఓకే అయ్యేదాకా మేం దేన్నయినా ధ్వంసం చేసేస్తాం. ..'
చీప్‌నీ, చక్రవర్తినీ వదిలేసి మేం వెనక్కితిరిగి చూడకుండా కిందికి వచ్చేశాం.

Subscribe to:
Post Comments (Atom)
1 వ్యాఖ్యలు:
namaste amma....media moham pagilela undi ee story....methati chepputo maadu pagile la kottaru...enni matalu cheppina...meeru meere
Post a Comment