Friday, October 14, 2011
నేను చాలా ధైర్యంగా రాస్తున్నానని ఆశ్చర్యపోయి మెచ్చుకుంటున్నవాళ్ళకి కృతజ్ఞతలు. ముప్ఫైయేళ్ళుగా మీడియాలో పనిచేస్తున్నాను. రూరల్ జర్నలిస్ట్‌లూ.. డెస్క్‌వాళ్ళూ.. రిపోర్టర్‌లూ.. నేను పనిచేసిన ఏరియాలన్నీ, మన ఇంట్లొ మనం స్వేచ్చగా తిరిగినట్లే వుంటుంది నాకు. జర్నలిస్టులన్నవాళ్ళు ఎలా వుండకూడదో.. ఎలా వుంటే బఫూన్‌లయిపోతారో రాస్తున్నానంతే. నా కొలీగ్స్ కోపం తెచ్చుకోరు. పైగా ఎవరు రాస్తే కోపం వస్తుందీ... ఇప్పుడిప్పుడే ఈ రంగంలో అడుగుపెట్టి, నాకంటే మిగతావాళ్ళు అల్ఫమానవులు.. నాకే బాగా తెలుసు.. నేనొక్కడినే కరక్ట్ అనుకొని ఇతరులపైన పడిపోతేనే ఎవళ్ళకైనా కోపమొస్తుంది. నా కథలు చదివారు. ఆ ఆడవాళ్ళందరి కష్టంలో నేనున్నాను. నాదీ అదే కష్టం. అందుచేత అవి సుజాత కథలు.. ఇవి మీడియా కథలు.
మనుష్యుల బలహీనతలపైన ఏ వ్యాపారమైనా జరుగుతుంది. జర్నలిజం విలువలదగ్గరనుంచి.. పత్రికలూ మీడియా వ్యాపారంలోకి మారిపోవడం కళ్ళారా చూసాను. ఈ వ్యాపారంలో ఉద్యోగులం అందరం భాగస్వాములం. ఒకళ్ళు ఒక బిజినెస్ పెట్టుకొంటే దాన్ని వృద్దిచేసే క్రమంలో పనిచేస్తున్నట్లు మేమూ అంతే. కథలు రాస్తే డబ్బులు రావు. పుస్తకాలు వేస్తే డబ్బు రాదు. రచయితలు వాళ్ళని వాళ్ళు పోషించుకొని, ప్రమోట్ చేసుకొని, వాళ్ళకోసంవాళు సమాజం పెట్టుకొని బతకాల్సిన రోజులివి. రాయటం మనకిష్టమైన వ్యాపకం అయినప్పుడు ఎలాగోలా కీర్తికోసమైనా రాస్తున్నామా లేదా..? ఉద్యోగం అవసరమైనప్పుడు బాగాలేకపోయినా దరిద్రం అనుకొంటూ చేస్తున్నామా లేదా..? మనమేం ప్రత్యేకమైనవాళ్ళం కాదు. మన అందరం ఒకటే.. ఒకే అచ్చు బొమ్మలం. 'నేను స్పెషల్ బాబూ .. మనం అలా ఉండలేమండీ.. ప్రపంచంలో బొత్తిగా మంచితనం పోయింది..' అని ఇలాంటి నిట్టూర్పులు విడుస్తూ చుట్టూ బోలెడుమంది. ఈ అబద్దాలని చచ్చినట్టు వింటాం. బ్లాగ్‌లో సరదాగా ఏదైనా రాద్ద్దామనుకొన్నాను. మనల్ని బోరుకొట్టే అతిగాళ్ళని మీడియాతో ముడిపెట్టానంతే.

Subscribe to:
Post Comments (Atom)
2 వ్యాఖ్యలు:
ఎవరి గురించీ ఆలోచించకుండా మీరు ముందుకు దూసుకుపొండి మీకు నచ్చినది రాస్తూ! మనమందరం ఒకే అచ్చు బొమ్మలం నిజమేగా! ప్రతీ ఒక్క మనిషీ మీరు చెప్పినట్టు జీవితంలో ఏదో ఒక సందర్భంలో అన్నా రాజీ పడక తప్పదు, నచ్చకపోయినా చేయక తప్పదు.
సుజాత గారికి.......
వంట ఇన్ని రోజులు ఆపేస్తే మా ఆకలి తీరేదెలా?......ఇన్ని రోజులూ మీ పోస్టులు తింటూ స్ఫూర్తి (శక్తి) తెచ్చుకుంటున్నాము. ఇప్పటికైనా వండి వడ్డిస్తే.......ఎంత చిన్న పదార్థమైనా......అభినందనలు తెలుపుకుంటాము.....
Post a Comment