Wednesday, October 12, 2011
'చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేయరా...' గర్జించాడు మా చీఫ్.
ఆయనకు రూరల్ రిపోర్టర్స్ పైన బహు ప్రేమ. ఆయన కేంప్‌కు వెళితే వాళ్ళంతా ఆయనను నెత్తిన పెట్టుకొని ఊరేగించినంత పని చేస్తారట.
'మీరా బైట్ చూసారా..' అన్నాను.
'పానశాలా... పాఠశాలా..అనే టైటిల్ కూడ పంపేశాడండి. ఎంత బావుందో చూడండి. వాళ్ళ భవిష్యత్ కాస్త పట్టించుకోండి. వాళ్ళు చిన్నవాళ్ళండి. ఎంత కష్టపడి ఆ న్యూస్ కవర్‌చేసాడో పాపం...' అన్నాడు మా చీఫ్.
ఆయన గొంతు బాధతో వణికింది.
'వేస్తే ప్రొబ్లం...' అని అంటున్నానోలేదో...
'ఏమండీ మీరు పై ఎత్తున కూర్చున్నారండీ.. ఎవరినైనా తొక్కేయగలరు. ఆ నున్న రిపోర్టర్ ఫోన్‌ల పైన ఫోన్‌లు. నేను కవర్‌చేసిన న్యుస్ మా వూళ్ళో సంచలనం. బిగ్ షాట్స్ వున్నారు అన్నాడు.. ఇవ్వాళ్టి రూరల్ న్యుస్‌లో ఇచ్చేయండి. పర్లేదండి, వాళ్ళ పైన నాకు నమ్మకముంది....' ఇది సుగ్రీవాజ్ఞ అన్నట్టు అన్నాడాయన మొహం మాడ్చుకొని.
ఏం చెప్పాలో నాకర్ధం కాలేదు. అప్పటికీ 'వేస్తే వాణ్ణి తంతారండి' అన్నాను కూడా.
'వాళ్ళు రిపోర్టింగ్‌లో వున్నారు.. ఆ మాత్రం గట్స్ వుంటాయి వాళ్ళికి...' అన్నాడు ఖచ్చితంగా.
నున్న రిపోర్టర్‌కి నూకలు చెల్లిపోతాయని నిశ్చయం చేసేసుకొని.. ఆ బైట్ ఎడిట్ చేసి డ్రాప్‌లో వేయమని చెప్పేసాను.
'ఆ నున్నగాడి బైట్ చూసారా' అంటూ వచ్చాడు షిప్ట్ ఇన్‌చార్జ్ శంకర్.
'స్కూల్‌లో కూర్చుని వాళ్ళ ఊళ్ళోవాళ్ళు పుల్‌గా తాగుతున్నారు. ఎవరిదో పెళ్ళనుకుంటా. వూరి సగం జనం అక్కడే ఉన్నారు....'
'నేను చెప్పాను బాబూ .. చిన్న వాళ్ళని తొక్కేస్తున్నానని చీఫ్ మండి పడ్డాడు...' అన్నాను.
'తొక్కటం కాదు.. ఆ ఊళ్ళోవాళ్ళే వీడి తోలొలిచేస్తారు.. ' అంటూ లేచిపోయాడు శంకర్.
మధ్యాహ్నం న్యుస్‌లో 'ఇది పానశాలా.. పాఠశాలా...!' అద్భుతంగా వచ్చేసింది.
స్కూళ్ళనీ, పంచాయితీ ఆఫీసుల్ని ఇల్లీగల్ యాక్టివిటీస్‌కి ఎలా వాడుతున్నారో చూడమని మా న్యుస్ రీడర్ అదిరిపోయే లీడ్ ఇచ్చేసాడు.
మంచి కెమేరామెన్‌ని హైర్ చేసాడనుకుంటా.. డబ్బులిచ్చాడనే గౌరవంకొద్దీ.. మా నున్న రిపోర్టర్‌ని వెనకాలే ఫాలోచేసి.. అతన్ని అందమైన యాంగిల్స్‌లో లాగించేసాడు. ఎడిట్ చేసే అవకాశం లేదు.
తాగేవాళ్ళు.. నున్న.., తాగిపడిపోయినవాళ్ళూ.. నున్న.., స్కూల్ బిల్డింగ్.. లైటూ.. అన్నీ వైడ్ షాట్స్... యధాతధంగా టెలీకాస్ట్ చేసేశాం.
ఎలాగోలా ఎప్పుడైనా మీ చానల్‌లో మమ్మల్ని చూపించరా వెధవా అని బుద్ధిలేక అడిగారే అనుకో... 'రాత్రిపూట ఎవ్వళ్ళూ లేరుకదాని ఆ స్కూల్‌లో కూర్చుని ప్రశాంతంగా మందు పుచ్చుకొంటుంటే.. దాన్ని ప్రపంచానికి చాటుతావురా చచ్చినాడా' అని వాళ్ళ మొగుళ్ళను అప్రతిష్టపాలు చేసినందుకు ఆడాళ్ళంతా కలసి నున్న గాడిని తన్నేశారట.
'ఇలా దౌర్జన్యం చేస్తున్నారు మిమ్మల్ని టీవీలో చూపెడతాను ' అన్నాడట నున్న.
'మోడ్రన్ మాలక్ష్మిలో ట్రై చేయిరా అని నాలుగు నెల్లనుంచీ నీకు అరిసెలూ, లడ్లూ మేపుతుంటే మెక్కి, నయా పైసా పనిచేయకుండా మమ్మలిని ఇలా గ్లామర్ లేకుండా చూపిస్తానంటావా ' అని రెండో విడత వాయించేశారట ఆడాళ్ళు.
నున్నకి హైద్రాబాద్‌లోనే వైద్యం.
ఖర్చులు ఆఫీసే భరించింది.
చీఫ్ స్వయంగా వెళ్ళి అయన్ని పరామర్శించాడు.
ఎలా పలకరించాలో తెలియక మేం మాత్రం మొహం చాటేశాం.

Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు:
Post a Comment