Thursday, September 29, 2011

ప్రస్తుతం ఖాళీ...

ఈ మధ్య కధలెందుకో ఊరికూర్కెనే మధ్యలోనే ఎండయిపొతున్నాయి. సాహిత్యరచనే జీవితంగా, ఊపిరిగా, అన్నంగా, బిసిబెళిబాత్‌లాగా ఉండాలనుకుంటుంటే.. ఎందుకు ఇలాగయిపోతుంది...? ఒక కధ మొదలు పెట్టాను. మంచి భార్యాభర్తలు. మంచంటే ఏమిటీ అని క్వచ్చన్ ఎదురుగ్గా. సమాధానం చివరి పేజీలో అనుకొని, సరేమరి ఆ భార్యాభర్తలు అన్యోనంగా ఉంటారని ఊహించే లోపల.. మరి అన్యోనం అంటే మళ్ళీ క్వచ్చన్. ఎవ్వళ్ళో ఒక్కళ్ళ మాటే ఇంకొకళ్ళు వినటం అని తోచింది. సరేపో... ఆ మంచి భార్యాభర్తలకి తగవచ్చింది. మాట ఎప్పూడూవినే మనిషి వినకపొతే వచ్చె తగవది. ఇద్దరిమధ్య బొలెడన్ని తగవులు పెడుతూ కధ రాసుకుపోవచ్చు అనుకొంటే ప్రతి తగవులోనూ వినే మనిషి ఓడిపోవడమే. నా ఇల్లు.. నా సంపాదన.. నా ఆస్థి.. నా రెండో పెళ్ళాం.. దిక్కున్నచోట చెప్పుకో.. పోతేపో.. ఇంకేముందీ.. వినే మనిషికి భయమేసింది. హాయిగా వింటేపోలా.. వెధవ ఉద్యోగాలు చేయాలి.. పిల్లల్ని ఖష్టపడి పెంచాలి. చందనాబ్రదర్స్, ఆరెస్‌బ్రదర్స్, సిఏమ్మారూ.. ప్రసాద్స్‌సూ.. హైద్రాబాద్ బిర్యానీ.. పిజ్జాలూ .. ఏవీ వుండవు. ఏం తగవులేద్దూ.. ఒక నిముషం ఊరుకొంటే వాడే పదింటికెల్లా పోతాడు. రాత్రి తొమ్మిదింటికెప్పుడో ఊడిపడతాడు. ఓ అరగంట కూడుపెట్టి మర్యాదచేస్తె సరి. అని వినేమనిషి నేను వద్దన్నా కాంప్రమైజ్‌కి మైండ్ పెడుతోంది. ఇంకేంవుంది.. కధయిపోయింది. సరే ఇంకోకధ. ఈసారి హీరోపైనే బేస్ చేద్దామనిపించింది. ఓ హీరో.. రవితేజ.. కిక్ కావాలి జీవితంలో.. యహె.. సినిమా కధకాదులే వేరే నా కధ. పరుగెత్తుతోంది. చదవాలి.. చదవాలి.. చచ్చేలా చదవాలి. చదివీ.. చదివీ.. అబ్బో కిక్కులేదు. సరె.. ఉద్యోగం.. చెయ్యాలీ.. చెయ్యాలీ.. చచ్చుకుంటూ నెలజీతం లక్షకోసం చెయ్యాలి. కళ్ళు వాచిపొయేలా సిస్టంకి అతుక్కుపోవాలి. కిక్కు.. అబ్బే.. అబ్బే.. పోనీ.. లవ్వూ.. ఓరిదేవుడో.. నిముష నిముషం అట్టెండన్సూ.. మెస్సేజులూ.. ఫొనులో ప్రేమ.. ప్రసాద్స్‌లో ప్రేమ.. ఒట్టి ప్రేమేనా.. ఒక్కో ప్రేమకు కనీసం రెండు వేలు. పైగా సినిమా మధ్యలోపోయి కూల్డ్రింకులూ.. కాఫీలూ.. అదేం కర్మో.. మల్టీప్లెక్సుల్లో యభైయేసి షాపులూ.. వావ్ బాగుందే అనగానే కొనతాలూ.. ఇంకో పదివేలూ.. వారానికి ఒక ప్రేమ చాలనిపించాక.. పోనీ పెళ్ళాడితేపోలా అనుకొంటే.. రొటీన్ మంత్రాలూ.. కాళ్ళు పడిపోయేలా రిసెప్షనూ.. హమ్మయ్యా.. ఆఖరాఖరికి ఫస్ట్ నైట్. కిక్కు లేదంటాడే హీరో.. జీవితాంతం పై మొత్తం పనులు చేస్తూనే.. చేస్తూనే ఉండాలని తలుచుకుంటే నడుం పీకేస్తుంది. కిక్ అంటే వాంతొస్తుంది అని హీరో పరుగోపరుగు. రెండో కధ అలా అయిపోయింది. మూడో కధ. తలుచుకొంటేనే కన్నీళ్ళొస్తున్నాయి. మీడియాపైన గాలిదుమారం రేపే సెన్సేషన్ కధ మొదలెట్టాను. నమ్మండి. ఒక్క సియివోను వెదికానంతే. ఇంకేంకధ. ఆ సియివో మొత్తం తనే. ఎవరెలా వుండాలో.. ఎవరెలా నవ్వాలో.. ఎంత తూకంగా.. నమ్రతగా వుండాలో మొత్తం... చక్రి సర్వోపగతుండు.. ఇంకేం కధ..? ఎలా నడపాలో తనకే తెలుసని నోరుమూసుకోని పొమ్మన్నాడు. ఇప్పటికి ఆరు నెలలు.. కొత్త కధకి థాటొస్తే ఒట్టు.. ప్రస్తుతం ఖాళీ.

1 వ్యాఖ్యలు:

సుజాత వేల్పూరి said...

సుజాతగారూ,
మీ టపా,.. చదివించడం కాదు, పరిగెత్తించింది అక్షరాల వెంట!

ఒక నిముషం ఊరుకొంటే వాడే పదింటికెల్లా పోతాడు. రాత్రి తొమ్మిదింటికెప్పుడో ఊడిపడతాడు. ఓ అరగంట కూడుపెట్టి మర్యాదచేస్తె సరి.______ ఇలా ఉండగలిగితే జీవితమంతా సుఖ శాంతులు పరిఢవిల్లుతాయన్నమాట!:-))

ఇంకేంకధ. ఆ సియివో మొత్తం తనే. ఎవరెల వుండాలో.. ఎవరెలా నవ్వాలో.. ఎంత తూకంగా.. నమ్రతగా వుండాలో మొత్తం... చక్రి సర్వోపగతుండు.. ఇంకేం కధ..? ________ఈ వాక్యం చాలా నవ్వించింది!
పదునైన మరిన్ని టపాలు మీ నుంచి ఎదురు చూస్తున్నా!