Wednesday, September 7, 2011

హాయ్..

నేను సుజాత. తెలుసు కదా. చెప్పటం, రాయటం.. నా ఉద్యొగమే కబుర్లు. రాయటానికీ, కబుర్లు చెప్పటానికీ పెద్ద తేడా వున్నట్లు లేదు కదా. కానీ మనం ఎలాగోలా మాట్లాడు కోవటం ముఖ్యం. ఛిన్నప్పుడు నాకు ఎవర్ని చూసినా వాళ్ళ మొహం ఏలావుందొ ఆలా అనుకరించాలనిపించేది. లలితాపవర్ మొహంలో క్రూరత్వం వెంటాడీ ఆమె పెదవి వణికించటం ప్రాక్టీసు చేసి అద్దం చూసుకుంటె ఆ మొహం నా మొహంలోకి వచ్చినట్త్లయింది. మళ్ళీ వదిలించుకొనేందుకు సమయం పట్టిందనుకోండి. మనం మనలా వుంటెనే సుఖం. ఇంకొళ్ళలా మంచిగానో, తెలివిగానో, లౌక్యంగానో అయిపొవాలని మనకీ వుంటుంది. వాళ్ళని ఆవాహన చేసుకోవాలని చూస్తాం. కానీ ఎంతసేపూ..కంట్లొ నలక పడితె యెంతసేపు భరిస్తాం..? అది ఎలగోలా వదిలెసి కన్ను యెర్రబడ్డా సుఖంగా వున్నట్టు.. మనకి సొంతంగా వున్న జీవితం మాత్రం అనుభవించగలం. ఏమంటారు.? మా బంధువు ఒకామె నన్ను ఎవే జయలలితా అని పిలిచెది. అబ్బో అంతగొప్ప సినిమా యాక్టరులాగ ఉన్నానేమోనని మనసులొ బొలెడంత సంతొషం. పదిసార్లు పిలిపించుకొన్నాక జయలలితగా వుండటం కన్నా నానిలాగ వుండటంలోనే మజా వుందని తేలింది. అందరినీ వొడించాలంతే మనం మనలాగ ఎందుకు వుండకూడదు..!

3 వ్యాఖ్యలు:

సుజాత వేల్పూరి said...

సుజాత గారూ, మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషం! జయలలితగా వుండటం కన్నా నానిలాగ వుండటంలోనే మజా వుందని తేలింది. అందరినీ వొడించాలంతే మనం మనలాగ ఎందుకు వుండకూడదు..!! ఎవర్నీ ఓడించడానిక్కాకపోయినా ఎప్పుడైనా సరే, మనం మనలాగే ఉండాలి! అంతే!

మనమెప్పుడూ మనలాగే ఉండాలి.

జ్యోతి said...

సుజాతగారు బావున్నారా??

నిజమే.. మనమెప్పుడూ మనలాగే ఉండాలి..అంతే!!!

Ramu S said...

మేడమ్ బాగున్నారా?
నేను ఎప్పుడు కలిసినా చక్కగా నవ్వుతూ మాట్లాడేవారు. మిమ్మల్ని ఇక్కడ మిస్ అవుతున్న వారిలో నేను ఒకడ్ని.
ఈ పోస్టులు చదువుతుంటే మీతో మాట్టాడినట్టే ఉంది.
ఆల్ ది బెస్ట్.
రాము
ఇండియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం