Friday, October 14, 2011
నేను చాలా ధైర్యంగా రాస్తున్నానని ఆశ్చర్యపోయి మెచ్చుకుంటున్నవాళ్ళకి కృతజ్ఞతలు. ముప్ఫైయేళ్ళుగా మీడియాలో పనిచేస్తున్నాను. రూరల్ జర్నలిస్ట్‌లూ.. డెస్క్వాళ్ళూ.. రిపోర్టర్లూ.. నేను పనిచేసిన ఏరియాలన్నీ, మన ఇంట్లొ మనం స్వేచ్చగా తిరిగినట్లే వుంటుంది నాకు. జర్నలిస్టులన్నవాళ్ళు ఎలా వుండకూడదో.. ఎలా వుంటే బఫూన్లయిపోతారో రాస్తున్నానంతే. నా కొలీగ్స్ కోపం తెచ్చుకోరు. పైగా ఎవరు రాస్తే కోపం వస్తుందీ... ఇప్పుడిప్పుడే ఈ రంగంలో అడుగుపెట్టి, నాకంటే మిగతావాళ్ళు అల్ఫమానవులు.. నాకే బాగా తెలుసు.. నేనొక్కడినే కరక్ట్ అనుకొని ఇతరులపైన పడిపోతేనే ఎవళ్ళకైనా కోపమొస్తుంది. నా కథలు చదివారు. ఆ ఆడవాళ్ళందరి కష్టంలో నేనున్నాను. నాదీ అదే కష్టం. అందుచేత అవి సుజాత కథలు.. ఇవి మీడియా కథలు.
మనుష్యుల బలహీనతలపైన ఏ వ్యాపారమైనా జరుగుతుంది. జర్నలిజం విలువలదగ్గరనుంచి.. పత్రికలూ మీడియా వ్యాపారంలోకి మారిపోవడం కళ్ళారా చూసాను. ఈ వ్యాపారంలో ఉద్యోగులం అందరం భాగస్వాములం. ఒకళ్ళు ఒక బిజినెస్ పెట్టుకొంటే దాన్ని వృద్దిచేసే క్రమంలో పనిచేస్తున్నట్లు మేమూ అంతే. కథలు రాస్తే డబ్బులు రావు. పుస్తకాలు వేస్తే డబ్బు రాదు. రచయితలు వాళ్ళని వాళ్ళు పోషించుకొని, ప్రమోట్ చేసుకొని, వాళ్ళకోసంవాళు సమాజం పెట్టుకొని బతకాల్సిన రోజులివి. రాయటం మనకిష్టమైన వ్యాపకం అయినప్పుడు ఎలాగోలా కీర్తికోసమైనా రాస్తున్నామా లేదా..? ఉద్యోగం అవసరమైనప్పుడు బాగాలేకపోయినా దరిద్రం అనుకొంటూ చేస్తున్నామా లేదా..? మనమేం ప్రత్యేకమైనవాళ్ళం కాదు. మన అందరం ఒకటే.. ఒకే అచ్చు బొమ్మలం. 'నేను స్పెషల్ బాబూ .. మనం అలా ఉండలేమండీ.. ప్రపంచంలో బొత్తిగా మంచితనం పోయింది..' అని ఇలాంటి నిట్టూర్పులు విడుస్తూ చుట్టూ బోలెడుమంది. ఈ అబద్దాలని చచ్చినట్టు వింటాం. బ్లాగ్‌లో సరదాగా ఏదైనా రాద్ద్దామనుకొన్నాను. మనల్ని బోరుకొట్టే అతిగాళ్ళని మీడియాతో ముడిపెట్టానంతే.

Wednesday, October 12, 2011
'చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేయరా...' గర్జించాడు మా చీఫ్.
ఆయనకు రూరల్ రిపోర్టర్స్ పైన బహు ప్రేమ. ఆయన కేంప్కు వెళితే వాళ్ళంతా ఆయనను నెత్తిన పెట్టుకొని ఊరేగించినంత పని చేస్తారట.
'మీరా బైట్ చూసారా..' అన్నాను.
'పానశాలా... పాఠశాలా..అనే టైటిల్ కూడ పంపేశాడండి. ఎంత బావుందో చూడండి. వాళ్ళ భవిష్యత్ కాస్త పట్టించుకోండి. వాళ్ళు చిన్నవాళ్ళండి. ఎంత కష్టపడి ఆ న్యూస్ కవర్చేసాడో పాపం...' అన్నాడు మా చీఫ్.
ఆయన గొంతు బాధతో వణికింది.
'వేస్తే ప్రొబ్లం...' అని అంటున్నానోలేదో...
'ఏమండీ మీరు పై ఎత్తున కూర్చున్నారండీ.. ఎవరినైనా తొక్కేయగలరు. ఆ నున్న రిపోర్టర్ ఫోన్ల పైన ఫోన్లు. నేను కవర్‌చేసిన న్యుస్ మా వూళ్ళో సంచలనం. బిగ్ షాట్స్ వున్నారు అన్నాడు.. ఇవ్వాళ్టి రూరల్ న్యుస్లో ఇచ్చేయండి. పర్లేదండి, వాళ్ళ పైన నాకు నమ్మకముంది....' ఇది సుగ్రీవాజ్ఞ అన్నట్టు అన్నాడాయన మొహం మాడ్చుకొని.
ఏం చెప్పాలో నాకర్ధం కాలేదు. అప్పటికీ 'వేస్తే వాణ్ణి తంతారండి' అన్నాను కూడా.
'వాళ్ళు రిపోర్టింగ్‌లో వున్నారు.. ఆ మాత్రం గట్స్ వుంటాయి వాళ్ళికి...' అన్నాడు ఖచ్చితంగా.
నున్న రిపోర్టర్‌కి నూకలు చెల్లిపోతాయని నిశ్చయం చేసేసుకొని.. ఆ బైట్ ఎడిట్ చేసి డ్రాప్లో వేయమని చెప్పేసాను.
'ఆ నున్నగాడి బైట్ చూసారా' అంటూ వచ్చాడు షిప్ట్ ఇన్చార్జ్ శంకర్.
'స్కూల్లో కూర్చుని వాళ్ళ ఊళ్ళోవాళ్ళు పుల్గా తాగుతున్నారు. ఎవరిదో పెళ్ళనుకుంటా. వూరి సగం జనం అక్కడే ఉన్నారు....'
'నేను చెప్పాను బాబూ .. చిన్న వాళ్ళని తొక్కేస్తున్నానని చీఫ్ మండి పడ్డాడు...' అన్నాను.
'తొక్కటం కాదు.. ఆ ఊళ్ళోవాళ్ళే వీడి తోలొలిచేస్తారు.. ' అంటూ లేచిపోయాడు శంకర్.
మధ్యాహ్నం న్యుస్లో 'ఇది పానశాలా.. పాఠశాలా...!' అద్భుతంగా వచ్చేసింది.
స్కూళ్ళనీ, పంచాయితీ ఆఫీసుల్ని ఇల్లీగల్ యాక్టివిటీస్‌కి ఎలా వాడుతున్నారో చూడమని మా న్యుస్ రీడర్ అదిరిపోయే లీడ్ ఇచ్చేసాడు.
మంచి కెమేరామెన్‌ని హైర్ చేసాడనుకుంటా.. డబ్బులిచ్చాడనే గౌరవంకొద్దీ.. మా నున్న రిపోర్టర్ని వెనకాలే ఫాలోచేసి.. అతన్ని అందమైన యాంగిల్స్‌లో లాగించేసాడు. ఎడిట్ చేసే అవకాశం లేదు.
తాగేవాళ్ళు.. నున్న.., తాగిపడిపోయినవాళ్ళూ.. నున్న.., స్కూల్ బిల్డింగ్.. లైటూ.. అన్నీ వైడ్ షాట్స్... యధాతధంగా టెలీకాస్ట్ చేసేశాం.
ఎలాగోలా ఎప్పుడైనా మీ చానల్లో మమ్మల్ని చూపించరా వెధవా అని బుద్ధిలేక అడిగారే అనుకో... 'రాత్రిపూట ఎవ్వళ్ళూ లేరుకదాని ఆ స్కూల్లో కూర్చుని ప్రశాంతంగా మందు పుచ్చుకొంటుంటే.. దాన్ని ప్రపంచానికి చాటుతావురా చచ్చినాడా' అని వాళ్ళ మొగుళ్ళను అప్రతిష్టపాలు చేసినందుకు ఆడాళ్ళంతా కలసి నున్న గాడిని తన్నేశారట.
'ఇలా దౌర్జన్యం చేస్తున్నారు మిమ్మల్ని టీవీలో చూపెడతాను ' అన్నాడట నున్న.
'మోడ్రన్ మాలక్ష్మిలో ట్రై చేయిరా అని నాలుగు నెల్లనుంచీ నీకు అరిసెలూ, లడ్లూ మేపుతుంటే మెక్కి, నయా పైసా పనిచేయకుండా మమ్మలిని ఇలా గ్లామర్ లేకుండా చూపిస్తానంటావా ' అని రెండో విడత వాయించేశారట ఆడాళ్ళు.
నున్నకి హైద్రాబాద్‌లోనే వైద్యం.
ఖర్చులు ఆఫీసే భరించింది.
చీఫ్ స్వయంగా వెళ్ళి అయన్ని పరామర్శించాడు.
ఎలా పలకరించాలో తెలియక మేం మాత్రం మొహం చాటేశాం.

Sunday, October 9, 2011
'నువ్వు దాన్ని పట్టించుకోకు.. అది జర్నలిస్ట్ దయ్యం..' అన్నాయి నా తోటి దయ్యాలు.
నేను వచ్చి వాలిన మర్రిచెట్టు పైన ఓవైపంతా చాలా దయ్యాలు, రెండోవైపు గంభీరంగా మొహం పెట్టుకొని ఒకేఒక దయ్యం.
'అలా ప్రత్యేకమైన దయ్యాలుంటాయా ..' అన్నాను నేను.
నేను గవర్నమెంట్ టీచర్ని కనుక ప్రశ్నలు వేయడం నాకలవాటు.
'ఏందు కుండవూ.. మనుష్యుల్లొ వాళ్ళు ప్రత్యేకమట. దయ్యాల్లోకూడా వాళ్ళు సెలబ్రిటీలట. ఎడిటర్ దయ్యం, ప్రొగ్రాం హెడ్, వాయిస్ ఓవర్లూ, యాంకర్లూ, న్యూస్‌రీడర్లూ, కాసేపట్లో వస్తాయి చూద్దువుగాని...' అంది నేను రాగానే నన్ను పలకరించి పరిచయం చేసుకొన్న ఓ ముసలామె దయ్యం.
జర్నలిస్ట్‌లంటే మనకి సరదా వేస్తుందికదా. ఈవిడ వద్దంటున్నా పోయి పరిచయం చేసుకొన్నాను.
జర్నలిస్ట్ దయ్యం నా వంక అలా కిందుగా చూసి 'నువ్వు మా స్టూడియోకి ఎప్పుడైనా వచ్చావా' అంది.
'అన్నపూర్ణానా... సారధా..' అనబోతున్నానా అంతలోనే నన్ను మద్యలో కట్ చేసి 'నీలాంటి బోడి టీచర్లు మా స్టుడియోకి రారు. చంద్రబాబునాయుడో, రాఘవేందర్రావో, రాజకుమారి, ఇంకా పనీపాడూలేని ముసిలి జర్నలిస్ట్‌లూ, తెలుగు భాషని కాపాడే వాళ్ళు, పండగలప్పుడు దేవుళ్ళగురుంచి చెప్పే ఆడాళ్ళు.. మహేషూ, యంటీయారూ.. ఇంకా చాలా మంది వస్తారు. నాకు వాళ్ళంతా ఫ్రెండ్స్. అబ్బో ఎన్ని ప్రొగ్రాంస్ చేశానో. అస్సెంబ్లీ, సెక్రటేరియట్ బీట్లూ, జగన్ ఓదార్పు యాత్ర.. చెప్పినా నీకేం తెలుస్తాయ్ ' అంది నన్ను బొత్తిగా తీసిపారేస్తూ.
నేను కాస్త చిన్నబుచ్చుకొని 'నేనూ సీరియల్స్ చూస్తా బాబూ.. టీవీ లేకుండా నిముషంకూడా వుండలే'నన్నాను.
'అసలు నేనులేకుండా నీకు టీవీ ప్రొగ్రాం లెక్కడివీ ' అంది దయ్యం విచారంగా.
'అవన్నీ వదిలేసి ఎలా వచ్చావూ అన్నాను నేను.
'ఏమో అలా పని చేస్తూ చేస్తూ రాత్రింబగళ్ళూ అక్కడే కదా. నిద్ర పోవటానికే ఇళ్ళు. చిన్న కునుకు తీస్తూ ఇలా వచ్చేసాను. భలే కంగారు పడ్డాననుకో. ఆఫీస్ వదిలి రాను కదా. ఒక్క మనిషీ తెలీదు, ఒక్క వీధీ తెలీదు, కొన్ని బజార్లు కూడా గుర్తుపట్ట లేక పోయాను. ఎవర్నైనా నేను వెళ్ళాల్సిన మర్రిచెట్టేక్కడా అని అడుగుదామంటే ఎవ్వళ్ళూ తెలీలేదు...'
'అదేంటీ.. నీకు సీఎంలూ.. సినిమా వాళ్ళూ తెలుసన్నావు కదా ' అన్నాను ఆశ్చర్యపోయి. నామట్టుకు నాకే ఈ చెట్టుపైన వచ్చి వాలగానే యాభై మంది దాకా తెలిసినవాళ్ళు కనిపించారు...
'అదేకదా.. నాకు తెలుసువాళ్ళు, నేనెవ్వళ్ళకీ తెలీలేదు. ఎవ్వళ్ళూ నన్ను గుర్తుపెట్టుకోలేదు, పట్టించుకోలేదు.. చూసావుకదా ఎలా ఒంటరిగా వున్నానో...'
'అదేంటీ.. జర్నలిస్ట్ అంటే చాలా గొప్ప ఉద్యోగం కదా. నువ్విలా అయిపోవడమేమిటీ.. '
జర్నలిస్ట్ దయ్యం చిరాకు పడింది.
'నేను గొప్పే.. ఆ సంగతి ఎవ్వళ్ళకి తెలుసు. ఈసారి నేను పోలీస్ కానిస్టేబుల్‌గా పుట్టాలనుకున్నా. జర్నలిస్ట్‌నని ఎవడైనా అన్నాడో వాడికి నూకలు చెల్లినట్టే...'
'ఇంకానయం... నేను వచ్చే జన్మలో జర్నలిస్ట్‌ని అవ్వాలనుకున్నా, ఈ తిక్క వెధవికి చెప్పానుకాదు..'

Friday, October 7, 2011
'సెట్లో చారిగారిని చూస్తే ముద్దోచ్చేస్తుందీ' అన్నాను.
'నాక్కూడా...' అన్నాడు మా మార్కెటింగ్ మేనేజర్.
'అరగంట స్లాట్ యాభై వేలు. పదమూడు స్లాట్స్కీ నెట్ క్యాష్ ఇచ్చేసాడు. ఇప్పుడీయన్ని ఎత్తుకొని సెట్ చుట్టూ తిప్పూ అన్నా తిప్పుతా' అన్నాడాయన తన్మయంగా.
వారఫలాల కోసం వేసిన సెట్ అదిరింది. వెనక్కాల ఏడుకొండలవాడి విగ్రహం, ఆయన అభయ హస్తం సరిగ్గా తన నెత్తిదగ్గర రావాలని చారీగారు కోరినట్లు ఆర్ట్ డైరక్టరు చారి నెత్తి పైన వెంకన్న చేయి పెట్టేసాడు.
'మన చీఫ్ ఒకసారి వచ్చి చూస్తానన్నారు. ఆయన రాగానే మొదలు పెట్టేద్దాం ' అన్నాడు మా.మే.(మార్కెటింగ్ మేనేజర్).
'చారిగారు సినిమా యాక్టరా.. అన్ని యాంగిల్సూ చూపించేందుకు, సింగిల్ కేం చాలు అని మేం మొత్తుకొన్నా వినకుండా మా మా.మే. త్రీ కేం సెట్టప్పు స్వయంగా దగ్గరుండి అరెంజ్ చేయించాడు. కూర్చున్న వినాయకుడిలా వున్న చారిని అన్ని కేముల్లో క్లొజులూ, వైడ్లూ తీసి చూసి హమ్మయ్యా అని రెడీగా వున్నారు కేమేరామెన్లు.
'పది నిముషాల్లో దుర్ముహూర్తం, మొదలెట్టండో..' అని చారి వెంటాడి వేధిస్తున్నా.. విననట్లు చీఫ్ ఎడిటర్ కోసం అందరం స్టుడియోలో ఎదురుచూస్తున్నాం.
సరిగ్గా పదే పది నిముషాల తర్వాత చీఫ్ వచ్చారు. చారిగారు వెంటనే గుప్పెడు మట్టి, ఒక ఆకుపచ్చ రాతి వుంగరం భక్తిగా ఆయన చేతుల్లో పెట్టాడు.
'అది త్రివేణీ సంగమంలో తీసిన మట్టి, ఏ టెన్షనూ దగ్గరకు రానివ్వదు. ఈ ఉంగరం ప్రత్యేకంగా చెన్నకేశవుడి పాదాల దగ్గరనుంచి తెచ్చాను. నాకీ ప్రొగ్రాం దయచేయించి నన్నూ నా శక్తినీ ఈ ప్రపంచానికి చూపిస్తున్నందుకు మీకు సర్వదా రుణపడి వుంటానూ' అన్నాడు చారి చీఫ్ ఎడిటర్ పట్ల కృతజ్ఞతతో కరిగి నీరైపోతూ.
అందరి ముందూ అందుకుంటే బావుండదని కాస్త ఇబ్బందిగానూ, పోన్లే మట్టీ రాయే కదా అని అనుకొనో, కాస్త నవ్వు మొహంగా అవి అందుకొంటూ...
'మీరు చెప్పిన ప్రతి అక్షరం నిజమవుతుందాన్నారు చారిగారూ, మాట నిలబెట్టుకోవాలి' అన్నాడు మా చీఫ్.
'గ్రహాలు నేను ఆగూ అంటే ఆగూతై, భూత భవిష్యత్ వర్తమానాలు నా కళ్ళముందునుంచే కదులుతాయి' అన్నాడు చారి.
సెట్లో చారి గారి విగ్రహం చక్కగా సూటయ్యింది.
'ఏమిటీ ఆలస్యం మొదలు పెట్టండి ' అన్నాడు చీఫ్.
చారి ఆయన్ని చేయెత్తి ఆశీర్వదిస్తూ....
'మీ చానలూ మీరూ ఉన్నత స్థితిలోకి వెళతారు ' అంటున్నాడు.. అంతలో కేమేరాకి అడ్డం రాకుండా ఉండేందుకు చీఫ్ వెనక్కి అడుగు వేయటం, కేమేరా వైర్లు కాలికి చుట్టుకొని.. వెల్లికలా...
ఎందుకులేండి.. చారి గారి అదృష్టం బావు లేడు.
ప్రొగ్రాం కేన్సిల్.
అడ్వాన్సుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇమ్మని మా మా.మే చుట్టూ తిరుగుతున్నాడిప్పుడు.
అయనకు మంచిరోజులెప్పుడో పాపం!

Wednesday, October 5, 2011
'అసలు మన చానలెక్కడుందీ...'
మా బాస్ అక్షరాలా రంకె పెట్టాడు.
'అదుర్సులూ, వావ్లూ, వెధవ వంటల ప్రొగ్రాంకున్న రేటింగ్‌లు మనమిచ్చే సెన్సేషనల్ న్యూస్‌కు ఎందుకురావూ... మనుషులు ఎందుకు నేర్చుకోరూ.. '
'ఏం చూసినా ప్రయోజనం లేదని తేల్చుకొని వుంటారు సర్, వస్తే జగన్ రావాలి, లేకపోతే కిరణ్కుమారో, ఇంకా అవకాశముంటే కేసీయారో, కోదండరామో, కవితో ఎవరో ఒకరు వస్తారుకదా, మనం కలికంలోకూడా కనిపించం కదా అని తెలిసిపోయి సరదాగా బల్బులు తినటం, పాముల్ని మెడలో వేసుకోవడం, కార్లని పొట్టమీదుగా పోనివ్వడం చూస్తున్నారు సార్ ' అన్నాం ఏక కంఠంతో.
మళ్ళీ పొరపాటు పడ్డాం.
మా చక్రవర్తి ఒక్కడే లేచి నిలబడి, ' మన న్యూస్ చానల్స్‌లో కూడా కొన్ని ప్రయోగాలు చేయెచ్చు సార్ ' అన్నాడు ముందుగా మావైపు, తర్వాత చీఫ్ వైపు చూసి.
'నిన్ను చూస్తే ప్రాణం లేచి వస్తుందోయ్, చెప్పు చెప్పు ..' అన్నాడు చీప్.
'పులితో నలభై రోజులు అని పులినీ, దాని ట్రైనర్నీ ఒక రూంలో పెట్టి కౌంట్‌డౌన్ ఇచ్చేద్దామా..' అన్నాడు వుత్స్చాహంగా మా చక్రవర్తి.
' మన ఎదురుగ్గా బిర్యానీ కనబడుతుందనుకో ఎంత సేపు చూస్తూ కూర్చుంటాం. పులికి కూడా మధ్యలో దాని ఫుడ్ గుర్తొచ్చిందనుకో ట్రైనర్‌ని చప్పరించేస్తుంది...' అన్నాడు ట్రైనీ సబ్ శీను.
వాడెప్పుడూ అంతే అన్నీ నెగిటివ్ థాట్సే.
అందరూ చక్రవర్తిని చూసి నవ్వేలోగా, తెలివైన మా బాస్ ఆ ఐడియాని తనే గుటకలో మింగేసి.. 'అబ్బే అలాంటివికాదోయ్ కాస్త లైవ్లీగా చూడు అన్నాడు.
' సార్ ఐడియా సర్, ఈ ఉదయం నుంచీ మనం కుప్పాయితిప్ప గ్రామంలో దెయ్యం వుందని పుకారూ, గ్రామం వదిలి పోతున్న గ్రామస్తులూ .. అంటూ స్క్రొలింగ్ వేస్తున్నాం కదా సార్.. ఆ దెయ్యాన్ని కనిపెట్టేద్దామా ' అన్నాడు చక్రవర్తి.
' ఎలా..' అన్నాడు చీఫ్. ఆయన మొహం కొంచెం కొంచెంగా వెలుగుతోంది.
' ఏముంది సార్, రాత్రి అక్కడ మకాం వేస్తాం. లేకపోతే డే లైట్లోనే నైట్ ఎఫెక్ట్ ఇచ్చి చెట్లూ, తుప్పలూ షూట్ చేద్దాం.. అదిగో దయ్యం అంటూ యండమూరి తరహాలో చివరిదాకా వుందీ వుందీ అని, స్పాట్ లైట్లు చూపెడుతూ చివరికి వీరేంద్రనాథ్లాగే సైంటిఫిక్ రీజనింగ్ ఇచ్చేద్దాం...'
యధావిధిగా బుర్రలు లేకుండా పుట్టి మీడియాలోకి వచ్చినందుకు మాకు కాసిని దీవెనలూ, చక్రవర్తి అడిగిన బడ్జెట్ శాంక్షన్లూ జరిగిపోయాయి.
మూడో రోజు మా కోర్ మీటింగ్ అచ్చం చక్రవర్తి సంతాపసభ మాదిరిగా జరిగింది. చీఫ్ ముక్కలు ముక్కలుగా విషయం చెప్పారు. ఆ రాత్రి కుప్పాయితిప్ప క్యాంపు. ముందే వెళ్ళిన ఆర్ట్ డైరక్టరు స్పెషల్ ఎప్ఫెక్ట్ రావాలని హటాత్తుగా మండే గంధకం మంటలూ, పొగలూ పెట్టించాడట. చివర్లో లేటుగా వచ్చిన చక్రవర్తి అక్కడ నిలబడి ఏర్పాట్లు ఎలా వున్నాయని అడిగాడట. అనుకున్న ఎఫ్ఫెక్ట్ వస్తుందో.. రాదో చూద్దామని ఆర్ట్గాడు మంటా, పొగా, నక్కల ఊళా, ఒకేసారి తెప్పించాడు. చక్రవర్తి దడుచుకొని.....
ఇప్పటికి వారం.
ఆ ఎఫ్ఫెక్ట్లోంచి చక్రవర్తి ఇంకా బయటికి రాలేదు.
దడుపు జ్వరం.
గమనిక: ఫెంటాస్టిక్.. మైండ్ బ్లోయింగ్... అన్బిలీవబుల్... అంటూ చక్కగా బంగారంలాగా మహేష్‌బాబు దూకుడులో అరిచినట్లు మేంకూడా మీడియాలో చెబుతుంటాంకానీ జనం నమ్మరనుకుంటా. అందుకే మా చానలెక్కడుందో మా చీఫ్‌కే అర్థం కాలేదన్నాడు.

Tuesday, October 4, 2011
'ఒక్కటంటే ఒక్క బైట్ తేలేకపోయావా...'
'మొహం పగిలిపోతుంది సర్. కెమేరా డామేజ్ అవుతుందని కెమేరామెన్ కూడా కోపరేట్ చేయటం లేదు...'
'చూడండయ్యా.. పక్క చానల్స్ చూడండి.. వాడెవడో ఒక్కడే.. దూకుడులో మహేష్లాగా బస్సుల్ని రాళ్ళుచ్చుకొని కొట్టుకొంటూ పోతున్నాడు...'
'అదే సర్ ఆలోచిస్తున్నా.. మనం కూడా ఏదైనా మేనేజ్ చేయగలమా అని...'
'అంటే ఏమిటి నీ ఉద్దేశం. నువ్వే ఎవడిచేతనైనా రాళ్ళేయిద్దామనా....'
మా చీప్ గావుకేక పెట్టాడు. ఫోన్ విసరికొట్టినట్టు టేబుల్ పైన పెట్టేసాడు.
'ఉదయం నుంచి ఆల్ చానల్సూ.. సకల జనుల సమ్మే .. బంధూ.. జనాల్ని రాళ్ళతో మాడు పగిలేలా ఆందోళనకారులు కొట్టటం.. పరమ ఉత్సాహంగా లైవ్లిస్తున్నాయి. మా చానల్‌కి ఇంకా ఫీడ్ రాలేదు. కోర్ మీటింగ్‌లో, మేమంతా బిస్కట్లు తిని, కాఫీలు తాగి.. అదే చర్చిస్తున్నాం.
'ఈ భద్రాచలం రిపోర్టర్ చాలా డేంజర్లా వున్నాడే.. ఖమ్మం రిపోర్టర్ ఏమైయ్యాడసలు.. ఈ భద్రాచలంగాడు ఖమ్మం రోడ్లపైకి ఎందుకొచ్చాడో కనుక్కో' అన్నాడు చక్రవర్తితో మా చీప్.
మా అవుట్‌పుట్ చక్రవర్తికి తను ఈ ఫీల్డ్‌లో ఒకే ఒక్కడనని, తనే నంబర్వన్అని పిచ్చ నమ్మకం.
'ఖమ్మం పులిగాడు బంధ్ యాక్టివిటీస్‌లో రిస్క్ తీసుకోలేనని, ఎవరైనా రాయిచ్చుకు కొడితే తల పగులుతుందని చేతులెత్తేసాడు సర్. భద్రాచలంగాడిని నేనే తరిమా. వదిలేయండి సర్. గంటలో బైట్స్ లైవ్ ఇద్దాం. ఇద్దరు యూత్లీడర్స్కి చెప్పేసా. బంధ్ గురించి ఒపీనియన్ పోల్ కోసం మాస్ రెడీ' అన్నాడు గర్వంగా మా అందరివైపూ చూసి.
'వెరీ గుడ్ చక్రవర్తీ.. రిపోర్టింగ్‌లో రాణించాలంటే నీకులాగ గట్స్ కావాలి. ఎయిటీటూలో మేం ' అని.. అంటూ మా చీప్ పాత డ్రీంలోకి వెళ్ళిపోయాడు. చాలా సార్లు ఆ డ్రీం మేం చూసేసాం కాబట్టి చెవులు మూసుకొని హరహరా అనుకోబొయే లోగానే గ్లాస్ డోర్ పగలగొట్టుకొని దూసుకొంటూ వచ్చిందొక రాయి. 'వామ్మో.. ' అన్నారు అందరూ. చక్రవర్తి అరెంజ్చేసిన ఆందోళన కారులకు కాన్సెప్టు అర్థం కాలేదులా వుంది. వాళ్ళ అభిప్రాయన్ని గాలికొదిలేసి కింద పార్క్ చేసివున్న మా చీప్ కారు బుర్ర బద్దలగొట్టేసారు. ఆఫీస్ అద్దాలు ముక్కలు చేసేసారు. అందరం కిందికి తొంగి చూసాం. మా చక్రవర్తి పెట్ కెమేరామెన్ గర్వంగా యూత్ లీడర్స్ ఇద్దరినీ ఎండలో నిల్చోబెట్టి ఒపీనియన్ తీసుకొంటున్నాడు.
'మా డిమాండ్స్ ఓకే అయ్యేదాకా మేం దేన్నయినా ధ్వంసం చేసేస్తాం. ..'
చీప్నీ, చక్రవర్తినీ వదిలేసి మేం వెనక్కితిరిగి చూడకుండా కిందికి వచ్చేశాం.

Sunday, October 2, 2011
'ఆఫీసాఫీసూ.. ఇంకా మాట్లాడితే స్టేట్ మొత్తం దడుచుకొని వుంటారూ అన్నాడు చీఫ్ ఎడిటర్. కోర్మీటింగ్. 'ఇక నీ పని సరీ అన్నట్లు చూస్తున్నారు కొలీగ్స్. 'మనమేంచేస్తాం సఋ అన్నాను కాస్త వణుకుతూ. 'అదేంటండీ.. ఇర్రెస్పాన్సిబుళ్ అన్నాడాయన చిరాగ్గా. దిక్కులు చూడతం తప్ప దారిలేదు. 'అలా క్యాజువల్‌గా చూస్తున్నానండి, ధఢేల్ మని సౌండూ' అన్నాడు మా చీఫ్. నవ్వాపుకోలేక మా గుంపులో ఒకళ్ళిద్దరు గట్టిగా, మిగతావాళ్ళు సౌండు లేకుండా నవ్వారు. 'మైకూ.. ముక్కుకు దగ్గరగా వుందికదా సర్.. వంగి తుమ్మేసరికి అంత సౌం....డూ' అన్నాను. 'మన యాంకరికికూడా ముందు ఐడియా లేదట సర్. హటాత్తుగా ఆపుకోలేకుండా వచ్చేసిందటా. పాపం, మా చీఫ్ కేమిటీ.. నాకే ఆ లైవ్‌లో అంతనోరేసుకుని, పైగా మైకు ముందుకల్లావంగి తుమ్మిన యాంకర్ పని పట్టేద్దామనివుంది. నాకంటే ముందే అదే ఏడుపు మొహంపెట్టింది. ఆవిడ ఎక్స్ప్రెషన్స్చూసి కెమేరామెన్ చాకచక్యంతో క్యాం ఎక్స్‌పర్ట్‌కి డైవర్ట్ చేసాడు ఇంకా నయం. 'అబ్బే లైవ్‌లో తుమ్ములూ, దగ్గులూ ఎంబ్రాసింగా వుండవూ..' అన్నాడు చీఫ్. ఆయనకు కోపం తగ్గించే మార్గం లేదు. రావే ఈశ్వరా కావవే వరదా.. అని మనస్పూర్తిగా ప్రార్థించే వుంటాను. మా చీఫ్ ఫోన్ మోగింది. 'స్విచ్చెర్ ఆపరేటర్ యోగేష్‌ని రమ్మన్నారట. మీ డోర్ దగ్గర వెయిటింగ్' అని పిఏ గొంతు స్పస్టంగా అందరికీ వినపడింది. అంతలోనే డోర్ తెరుచుకొని యోగెష్ వచ్చాడు. ఒక మనిషి నేను మండాలి అని నిశ్చయించుకొంటే ఎలా మండచ్చో మా చీఫ్లో విజువల్‌గా చూసామందరం. 'యోగేష్ బుద్ధుందా.. కాలు తగిలి వాటర్ బాటిల్ పడి, వాటర్ ఫ్లోర్‌పైన పరుచుకుపోతుంటే చూడమని బాయ్‌కి కదా వేలు చూపించింది. దాన్ని.. హైలైట్ చేస్తావానువ్వు ..నా బూట్ క్లోజప్‌లో ఎందుకు చుపించావో చెప్పూ. యోగెష్ అందరివైపూ చూసాడు. మండుతున్న చీఫ్ మొహం చూసాడు. 'లైవ్‌లో మీముందు మాట్లాడిన ఎక్స్పర్ట్ మీడియా వాళ్ళని, ఇలాంటి రాతలు రాసినా, తీసినా చర్మం వలిచి కొట్టాలి అంటున్నాడు సర్. అంతలో మీరు వేలు చూపించారు. ఒకవేళ మీరు అలావాగితే చెప్పుతీసుకొని కొడతా అన్న అర్థమొచ్చేలా వేలితో బూట్ చూపిస్తున్నారేమోనని బ్రైన్ థాట్ సర్' అన్నాడు సిన్సియర్‌గా. న్యాయంగా కోర్ మీటింగ్ హాల్ నవ్వులతో దద్దరిల్లి పోవాలి. అలా పోతే వుద్యోగాలు గాలికి ఎగిరిపోతాయని ప్రతివాడూ సర్వశక్తులూ ఒడ్డి ఇనప మొహాలు పెట్టుకొన్నారు. నవ్వింది మా చీఫ్ ఒక్కడే. పైగా.. ఎవ్వళ్ళూ నవ్వనందుకు ఎవ్వడికీ సెన్సాఫ్హ్యూమర్ లేదని తిట్టిపోసాడు. ఆ ఊపులో లైవ్‌లో తుమ్మిన యాంకర్ని క్షమించి పారేసాడు.
నీతి: ఎంత దగ్గయినా... తుమ్మయినా సరే లైవ్‌లో క్షమించరాని నేరం.
మనలో మనమాట: స్క్రీన్‌పైన చక్కగా నగలేసుకుని, కర్టసీ సారీ కట్టుకొని నోరంత తెరచి తుమ్మటమేమిటండీ అసహ్యంగా.. నాకూ నచ్చలేదు. ఇదిగో ఎవరక్కడ.. పోయి, నిన్న లైవ్‌లో తుమ్మిన పిల్లని పరిగెత్తుకొంటూ రమ్మనండి.. ఇక్కడున్నట్లు రావాలి... అర్జంట్.. సుజాతా.. మజాకా..!

Subscribe to:
Posts (Atom)