Friday, September 30, 2011
'మీ ఇంటికి ఫోన్‌చేస్తే ఎవళ్ళూ లిప్ట్ చేయలేదనీ అడిగాను మా ప్రొడ్యూసర్ని. 'అవసరమైతే ఎస్ఎమ్మెస్ పెట్టాలి. ఏనిమిషాన్నయినా జీ టీవీనుంచో, ఈటీవీనుంచో కాల్ వస్తుందని వెయిటింగ్. తెలిసిన నంబర్లు తీయదూ అన్నాడతను. మా పక్క ఫ్లాటే వాళ్ళది. ఆ అమ్మాయి నాకు బాగా క్లొజ్. 'ఆవిణ్ణి ఎమైనా అంటే మీరు ఊరుకోరుకానీ మేడం, ఇవ్వాళ మధ్యాన్నం తిండికివస్తాను, బయటంతా బంద్, ఎక్కడా ఏమీ దొరకలేదు, నాకూ ఏమైనా వుంచండి అని చెప్పాలని ట్రై చేస్తున్నా.. ఫోన్ వాడదట.. రాత్రే అనౌన్స్మెంట్. ఏదో వుంది మేడం విషయం. ఫీల్డ్‌లో వున్నానా.. నాకు ఒక్క ప్రొడ్యూసర్ తెలియదు. నీ ఇల్లు బంగారంగానూ ప్రొడ్యూసరూ... మోడ్రన్ మహాలక్ష్మి గాడూ.. గడసరి అత్తగాడూ.. ప్రతివాడూ ఈవిడ కాంటాక్ట్‌లో వుంటారు. అప్పుడోసారి ఎస్ఎమ్మెస్ కాంటెస్ట్‌లో ఈవిడకో వెండి గ్లాస్ వచ్చింది, దానికోసం చానల్చుట్టూ తిరిగానే.. మొదలూ.. ఇక అడ్డమైన ప్రోగ్రాములూ.. ఎస్ఎమ్మెస్ రిక్వెస్ట్లూ.. దానికి అన్నం నీళ్ళూకూడా అక్కరలేదు. సారీ.. ఆవిడని దాన్నీ అన్నందుకూ అన్నాడు నిష్టూరంగా మా ప్రొడ్యూసరు. దొంగకి తేలుకుట్టడం అంటే అర్థమైంది నాకు. సమాధానాలు నా దగ్గరే వున్నాయి. ఈ నెల ఆ పిల్ల ఫోన్ బిల్లు పద్దెనిమిది వేలు. ఇంకా ఈ అమాయకుడికి తెలీలేదు. ఫోన్ కొట్టు లక్ష పట్టుకి వరుస పెట్టి కాల్స్ చేసింది. ఒక్కో కాల్ ఆరు రూపాయలు. ఇప్పుడు నా ఫోన్ ఎందుకనుకున్నారూ మోడ్రన్ మహాలక్ష్మికి సెలెక్ట్ అయ్యానూ.. ఇప్పుడు టీవీలో వస్తున్న యాంకర్ కట్టుకొన్న చీర నా కోసం తెచ్చేయండీ.. బిల్లు కట్టేద్దాం, రేపు ప్రొగ్రాంలో కట్టుకోవాలని నాకో హుకుం. చేతిలో ఫోనుందికదాని జ్వువెలరీతోసహా చీరకు బిల్లు పెట్టండీ అని కాస్ట్యూమర్‌కి చెప్పేశాను. పది నిముషాల ముందే చీరా నగలూ ఇంటికి వచ్చాయి. బిల్లు పదహారు వేలు. ఈ విషయం చెబుదామనే చూస్తుంటే మా ప్రొడూసర్ ఆక్రోశం వినబడింది. 'అసలు ఈవెర్రి ప్రోగ్రాములు చూడటం, ఎస్ఎమ్మెస్లూ, పైగా మా ఆయన మన చానల్ హెడ్ అని చెప్పిందట. నా ఉద్యోగం ఊడినంత పనయింది. ఇవ్వాళ నేను కొంపకు చేరాక ఆ టీవీ కనెక్షన్ తీసేయిస్తాను, లేకపోతే అమ్మేస్తాను. ఇంకా ఈవిడ నోరెత్తితే విడాకులు ఇచ్చేస్తాను. లేకపోతే ఫోన్ తియ్యదు.. ఒక్కో అక్షరం వెతుక్కుని ఎస్ఎమ్మెస్ పెడుతున్నా. నాకు తిండి కావాలి, వండుకున్నవన్నీ తినేయద్దూ' అని ఏడుపు గొంతులోకి దిగిపోయాడు మా ప్రొడ్యూసర్. ఓదారుద్దాం అనుకొనేలోపలే ఆ అమ్మాయి లైన్లోకి వచ్చింది. 'గడసరి అత్తకి సెలెక్ట్ అయ్యాను మా అత్తగారు ఇక్కడ లేదుకదా.. మీ పేరూ.. మనిద్దరం వున్న ఫోటో పంపేసాను, ఎల్లుండే ప్రొగ్రాం, మా అత్తగారిగా మీరు కరక్ట్‌గా సరిపోతారూ, అందా అమ్మాయి. కాగితాల కిరీటాలు పెట్టించుకోవడం, రికార్డింగు డాన్సులేయటం కళ్ళ ముందు ఆ కార్యక్రమం సెవెంటీ ఎంఎంలో కనబడుతుంటె నిముషంకూడా అలోచించకుండా మా ప్రొడ్యూసర్‌కి మెస్సేజ్ పెట్టేసాను 'పర్లేదు ఆ పిల్లకి విడాకులిచ్చెయ్, నెనో మంచి లాయర్ని చూస్తానూ అని.
Subscribe to:
Post Comments (Atom)
4 వ్యాఖ్యలు:
సుజాత గారు.. మంచి విషయం చెప్పారు. విడాకులకి .. టీ .వి కార్యక్రమాలు కారణం అవుతాయని చెప్పడమే కాదు.. అయ్యాయి కూడా.
పాపం ఆ అమ్మాయి :)) పాపం ఆ ప్రొడ్యూసర్ :))
వనజగారూ.. కొంచెం కారంగా... కొంచెం ఇష్టంగా.. మిమ్మల్నందరినీ సరదాగా నవ్వించటంకోసం మాత్రమే నా కొన్ని పోస్టులు.
సుజాత గారూ...
మీరు రాసిన దాన్నిబట్టి సీను ఊహించుకుని నవ్వుకున్నాను.
Thanks for your call.
రాము
apmediakaburlu.blogspot.com
Post a Comment