Saturday, September 24, 2011
అబ్బే అనిపించిందా.. వైరాగ్యం, నిర్లిప్తత, దేవుళ్ళు, దయ్యాలు, నమ్మకాలు.. ఈ లిస్ట్‌లోకి ఈ మాటకూడా వస్తుందనుకోండి.. ఈపాటికి ఇంకేం చదువుతాం లెద్దూ అనికూడా అనిపించిందా.. వద్దొద్దు మిస్సయిపొతారు.. ఎలా నిమిత్త మాత్రులమో తెలుసుకో వద్దూ.. ఇల్లాగే. మనిష్టం వచ్చినట్లు రాసుకొంటూపొయి, డైరక్ట్‌గా పెజీల్లో ఇచ్చేస్తూ.. అది డైరక్ట్‌గా పాటకులకు వెళ్ళిపొతూ.. ఎంతో జాయ్‌గా వుంటాంకదా. అలాంటిది ఒక అటాక్‌తొ నేను ఎలక్ర్ట్రానిక్ మీడియాలో వచ్చి పడ్డాను. మీడియా ఎదైనా ఒకటే.... చచ్చినా కాదు.... మన తలకాయలోంచి, పేజీల్లోంచి, పాఠకుల హ్రుదయాల్లోంచి పొయే దారి చటుక్కున మూసుకుపోయి.. యాంకర్ల మూడ్‌పైన, ప్రొడక్షన్ మేనేజర్ దయాధర్మాలపైన, షూటింగ్ కోసం మనకు కేటాయించిన కారు తాలూకూ డ్రైవరు, మేకప్‌మెన్, హేయిర్‌డ్రెస్సర్, క్యాస్టూంస్, చివరకు మనం నమ్మి, ప్రేమించి, ఇష్టపడి తీసుకొన్న డైరక్టర్కి ఇంట్లొ ఎలాంటి ప్రాబ్లంస్ రాకూండా చేయకుండా చేయమని మనం ఏడుకొండలవాడికి మొక్కినా స్ట్రాంగ్ మొక్కుపైన కూడా ఎలక్ర్ట్రానిక్ మీడియా వుద్యొగం వణుకుతూ, క్షణక్షణం బీపీ పెంచుతూ, మనకు వినయం నేర్పుతూ, మన గోళ్ళ వరకూ మాత్రమే మనం తినే చాకచక్యం అలవర్చుతూ వుంటుంది. ఇక్కడ మనం నిమిత్త మాత్రులం. మనం 10 గంటలకు ఎక్కడో దిల్సుఖ్‌నగర్‌లో ఏ కవి యాకూబ్ ఇంటిలోనో, మంతెన సత్యనారాయన్నో నాలుగు ముక్కలు మాట్లాడమని డిసైడ్‌చేసి 8 గంటలకే ఆఫీసుకు వస్తాం. ఎగ్జాక్ట్ 10.30 అని ధైర్యంగా, తెలియక చెప్పేస్తాం. తీరా ఆఫీసులో అడుగు పెట్టెసరికి అప్పటికి తయారై కారెక్కాల్సిన సుభాషిని.. హెయిర్ డ్రెస్సర్ జుట్టు స్ట్రెయిట్ చేస్తుంటే తీరిగ్గా ఫొన్లో మాట్లాడుకునే పనిలో వుంటుంది. కెమేరామెన్, అసిస్టెంట్, లైట్‌బాయిస్ , టిఫిన్ తింటేగానీ ఎలాగూ బయలుదేరంకదా అని.. క్యాంటిన్లో సెటిలై వుంటారు. ప్రొడక్షన్ మేనేజర్ ఇప్పుడే బయలుదేరాను మేడం అని ఫోన్ స్విట్చాఫ్ పెట్టేస్తాడు. కారుంటుంది, డ్రైవరు కనిపించడు. కాస్ట్యుంస్ అతను ఇప్పుడే నీరూస్‌కి వచ్చాను, డోర్ తీయలేదు అంటాడు తాపీగా. ఏదో ఒకటి, ఎలాగోలా ముగించి రావోయ్ సుభాషినీ అన్నామా .. సరైన మేకప్‌లేక, డ్రస్సులు రాకా, మనం తొందరపెట్టి విసుక్కోవటంవల్లా మూడాఫ్ అయిపోయి, కళ్ళనీళ్ళోచ్చి, మేకప్ చెడిపోతుందన్న భయంతో, మనసు మూగభాధకులోనై, నేనీరోజు వచ్చినా సరిగ్గా ప్రోగ్రాం చేయలేకపొతాను అన్న అల్టిమేటం నా మొహాన్ని విసిరేసి సరిగ్గా పదింటికి టిఫెన్ మింగేందుకు క్యాంటిన్‌కి నెమ్మదిగా నడచి వెళుతూవుంటే.. అలా చూస్తూ వుండిన క్షణాన మంతెన సత్యనారాయణ ఫోన్ చేసి, నేనూ నా లేహ్యాలూ రెడీ అన్నాడనుకోండి.. అ క్షణాన 'మనం నిమిత్త మాత్రులం' అని నాకు అనిపించడం తప్పెనంటారా..?
Subscribe to:
Post Comments (Atom)
2 వ్యాఖ్యలు:
Thank you so much for taking the time to explain Sujatha garu.. understood the point.
చివరి లైను చదవగానే తెగ నవ్వొచ్చిందండి.
Post a Comment