Wednesday, June 8, 2016
అ.ఆ.. చూశాను. అచ్చం మీనా
సినిమా లాగే వుందని ఎఫ్.బిలో పోస్టులు చాలా చూశాక, ప్రాబ్లం ఏమిటంటే.. ఇటు అ.ఆ..
సరిగ్గా చూడలేదు. అటు మీనా సరిగ్గా గుర్తు రాలేదు, సినిమా బావుందో లేదో నా కర్ధం
కానంత సీరియస్ గా రంధ్రాన్వేషణకు పూనుకోవటం వల్ల.
ఇప్పుడు నీతి ఏమిటంటే , ఎవరు దేన్నయినా ఎలాగయినా కొట్టేయిని, అది పాటో,
కవితో, కథో.. ఏదయినా కానీ, దేన్లోంచి కొట్టేశాడా అని బుర్ర చెడ గొట్టుకొని
అఘోరించటం కంటే ఎదురుగ్గా కనిపించేదో, వినిపించేదో విని ఆనందించటం బెస్టు అని.
నేను సీరియల్ కోసం యద్దనపూడిగారి నవల
మౌనపోరాటం కొన్నప్పుడు, ఆవిడకింకా బుల్లితెరపైన ఇరవై శాతం ప్రేక్షకులు ఉన్నారు,
ఫర్లేదు అన్నారు భట్టుగారు. ఇంకో
ఐదేళ్ళుపోతే ఆ ఇరవైశాతం ఈ ప్రపంచంలోంచి పోతే, ఇక అప్పుడు పాత నవలలనీ, రాగాలనీ,
కవిత్వాన్ని మొత్తం సాహిత్యంలో ఏ ముక్కనైనా కొట్టేయొచ్చు, ఎవ్వళ్ళూ కనిపెట్ట లేరు. శ్రీశ్రీని
సినిమావాళ్ళు బతికించేరు కనుక గుర్తున్నాడు గానీ చరబండ రాజు ఎంతమందికి
గుర్తున్నాడు. ఆ.. పాపం.. నువ్వొక్కదానివే
మేధావి కామాకు మరి గుర్తులేడూ అని తగూలాడకండి, తల్లుల్లా ఊర్కే ఉదాహరణకు చెప్పా.
Subscribe to:
Posts (Atom)