Friday, November 22, 2013

‘మహిళా జీవిత అధ్యయనంలో ‘త్రీ ఇన్ ఒన్’

వరంగల్ కాకతీయ యూనివర్శిటి అనుబంధంగా కొత్తగా మొదలు పెట్టిన పోస్టు గ్రాడ్యుయేషన్ మహిళా కళాశాల తెలుగు ఎం.ఏ. సిలబస్ నాలుగవ పేపర్ గా ‘మహిళాజీవిత అధ్యయన సాహిత్యాన్ని’ ఎంపిక చేశారు.  ప్రొ. కాత్యాయని విద్మహే, మహిళల జీవితం గురించి విస్తృతంగా అధ్యయనం జరగాలని ఈ పేపర్ తప్పనిసరిగా సిలబస్ లో వుండాలని పట్టుబట్టారు. ఈ పేపర్లో మహిళల కథలు, కవితలు, సబ్జెక్ట్స్ గా వున్నాయి. కథా విభాగంలో మట్టిగోడలమధ్య గడ్డిపోచలు (శివరాజు సుబ్బలక్ష్మి), ప్రయాణం (అబ్బూరి ఛాయాదేవి), త్రీ ఇన్ ఒన్ (సి. సుజాత),  బచ్చేదాని (గీతాంజలి) ఎంపిక చేశారు.


నా కథ ‘త్రీ ఇన్ ఒన్’ ఎంపికైనందుకు నాకు చాలా సంతోషంగా వుంది. ఈ కథలో ఒక తరం స్త్రీకి నేను నిర్వచనం చెప్పాను. ఇరవైయేళ్ళ తర్వాత కొత్తతరం స్టూడెంట్స్ ఈ కథను చదువబోతున్నారు. స్త్రీల జీవితంలో కొత్తగా మార్పులేమైనా వచ్చాయా.. అలాగే వున్నారో..నేనూ తెలుసుకోబోతున్నాను. ఈ కథ తెలుగులో, ఇంగ్లీషులో ఈ బ్లాగులో అందుబాటులో వుంది. మీ అభిప్రాయం చెప్పండి.









                      ఇంగ్లీష్ లోకి ఈ కథను డా. హరిబండి లక్ష్మి ట్రాన్స్లేట్ చేశారు.. ఇంగ్లీషులో ఈ కథను  చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చేయండి.

http://csujatha.blogspot.in/2011/09/three-in-one.html